శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు

  • రూ.2.32 లక్షలు అందజేసిన ఇద్దరు భక్తులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం అన్నప్రసాద వితరణ పథకానికి ఇద్దరు భక్తులు మొత్తం రూ.2.32 లక్షలు విరాళంగా అందజేశారు అని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

కర్నూలుకు చెందిన లక్ష్మయ్య అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వాహణాధికారి సి.హెచ్. శ్రీనివాసరెడ్డికి అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసినట్లు తెలిపారు.

అలాగే శ్రీకాళహస్తికి చెందిన కె. వెంకటసుబ్బారెడ్డి కూడా అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందించారు. దాతకు తగిన రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply