Allu Arjun | ప్లాన్ మామూలుగా లేదుగా..

Allu Arjun | ప్లాన్ మామూలుగా లేదుగా..
అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో భారీ సినిమా
హీరోయిన్‌ల లిస్ట్ పెరుగుతోంది.. అనుష్క శర్మ ఎంట్రీ?
బాలీవుడ్ భామలతో నార్త్ మార్కెట్ టార్గెట్?
బన్నీ పర్‌ఫార్మెన్స్ హైలైట్ అవుతుందా?
టైటిల్ & టీజర్ రిలీజ్ ఎప్పుడు?
2027లో పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్
Allu Arjun | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి కాంబోలో క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించే హీరోయిన్ అంటూ బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేను ప్రకటించారు. మృణాల్ ఠాగూర్, రష్మిక, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇప్పుడు మరో క్రేజీ బ్యూటీని కూడా తీసుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో నటించే క్రేజీ బ్యూటీ ఎవరు..? ఈ మూవీ టీజర్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

Allu Arjun | అనుష్క శర్మ..
ఈ క్రేజీ మూవీలో నటించే మరో బ్యూటీ ఎవరంటే.. అనుష్క శర్మ పేరు వినిపిస్తోంది. ఈమధ్య అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంది. ఈ సినిమా ఒక పవర్ ఫుల్ (Power Full) కమ్ బ్యాక్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఇంత మంది హీరోయిన్స్ నటిస్తుండడం అనేది ఆసక్తిగా మారింది. అలాగే నార్త్ మార్కెట్ ని ఆకట్టుకోవడం కోసమే బాలీవుడ్ భామలను తీసుకుంటున్నారా..? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే.. గ్లామర్ కోసమో.. మార్కెటింగ్ కోసమో కాకుండా.. కథలో పాత్రలకు తగిన ప్రాధాన్యత ఉంటేనే.. సినిమాకి ప్లస్ అవుతుందనేది సినీ పండితులు అభిప్రాయం.

Allu Arjun | బన్నీ పర్ ఫార్మెన్స్ వేరే లెవల్లో..
ఇదిలా ఉంటే.. ఎంత మంది కథానాయికలు నటిస్తున్నా.. బన్నీ పర్ ఫార్మెన్స్.. వేరే లెవల్లో ఉంటుందని.. ఆయన చుట్టూనే ఈ కథ తిరుగుతుందని.. టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ (Movie) టైటిల్ అండ్ టీజర్ ఎప్పుడంటే.. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. బన్నీ బర్త్ డేకి ఒక రోజు ముందుగా రిలీజ్ చేస్తారా..? లేక అదే రోజు రిలీజ్ చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ఈ మూవీని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ క్రేజీ మూవీని 2027లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. బన్నీ, అట్లీ.. కలిసి ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేస్తారో చూడాలి.

