కనకదుర్గమ్మకు బంగారు లక్ష్మీ హారం..

కనకదుర్గమ్మకు బంగారు లక్ష్మీ హారం..
రూ 6.35 లక్షల కానుక సమర్పించిన భక్తుడు.
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తుడు బంగారు లక్ష్మీ హారాన్ని బహుమతిగా సమర్పించారు. నగరంలోని రామచంద్ర నగర్‌కు చెందిన శ్రీ దేవి శ్రీ రమ్య కుటుంబం అమ్మవారికి విలువైన బంగారు లక్ష్మీ హారాన్ని కానుకగా సమర్పించారు. భక్తి భావంతో సమర్పించిన ఈ హారం 42 గ్రాముల బరువుతో, రాళ్లు పొదిగిన ప్రత్యేక ఆకృతిలో రూపొందించబడింది.
దీని విలువ సుమారు రూ. 6,35,000/-గా అంచనా వేయబడింది. దేవస్థాన అధికారులు భక్తుల విరాళాన్ని స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబం అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ప్రధానాలయ సూపర్డెంట్ డివివి సత్యనారాయణ దాతకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
