2grms | బయటపడుతున్న నిజాలు..

2grms | బయటపడుతున్న నిజాలు..

2grms | ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ వినియోగం
పోలీసుల ఆకస్మిక దాడి వివరాలు
అరెస్టులు, స్వాధీనం చేసిన మత్తు పదార్థాలు
SIT దర్యాప్తు ప్రారంభం
కీలక నిందితుడు అభిషేక్ సింగ్ అరెస్ట్
ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై చర్చ

2grms | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అదో అందమైన ఫామ్‌హౌస్‌. ఆనందంగా గడిపేందుకు భూతల స్వర్గంలా ఉంటుంది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లలో చిల్ అవుతున్నారు. కానీ అక్కడ కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు… అక్రమ దందాలు, చీకటి బాగోతాలు, ప్రైవేట్ ఈవెంట్లు, డ్రగ్స్ పార్టీలకు కేంద్రంగా మారుతున్నాయి. అటువంటి ఘటన తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఇంతకీ ఏమిటీ ఆ ఫామ్‌హౌస్?

2grms
2grms

ఇటీవల వికారాబాద్ జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ఫామ్‌హౌస్‌లో చిన్న పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు ఈగల్ పోలీసులు ముందస్తు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జరుగుతుండగా గన్ ఫైరింగ్ శబ్దం వినిపించింది. దీంతో ఈగల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఆ 11 మందిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉన్నారు. దీంతో మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

2 గ్రాముల కొకైన్‌, ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిలో డ్రగ్స్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలోని బృందం, ఈ డ్రగ్స్ మాఫియాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది.

2grms
2grms

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ పార్టీకి హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వినియోగించినట్లు విచారణలో తేలింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడగా, పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి మద్యంలో కొకైన్ కలిపి సేవించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇప్పటికే కీలక నిందితుడు అభిషేక్ సింగ్ అరెస్టుతో కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన నాయకులే తప్పుదారిలో నడిస్తే, సామాన్య ప్రజలకు ఎటువంటి సందేశం వెళుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాసేవ అనే పవిత్ర బాధ్యతను మోస్తున్న వారు సమాజానికి ఆదర్శంగా నిలవాలి. కానీ కొందరు ప్రతినిధులు డబ్బు, అధికార అహంకారంతో నియంత్రణ కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డుతున్నారు.

Leave a Reply