ఉపాధి హామీ కార్మికుల సమస్యల పై నిరసన

ఉపాధి హామీ కార్మికుల సమస్యల పై నిరసన

మొవ్వ – ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునర్ధరించాలని, కేంద్ర ప్రభుత్వమే పథకానికి నిధులు ఇవ్వాలని, రాష్ట్రాలపై భారం తగ్గించాలని, రెండు పూటలా పని విధానం రద్దుచేసి, ఒక పూట విధానం అమలు చేయాలని, ఐరిస్ విధానం రద్దుచేసి మస్టర్ ద్వారా పాత విధానం తో హాజరు వేయాలని, ఆదివారం సెలవు కొనసాగించాలని, సమ్మర్ అలవెన్సులు పునరుద్ధరణ చేసి అమలు చేయాలని, ఫిబ్రవరి నుండి పనిచేసిన ఉపాధి కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, అదనపు పనులు గుర్తించి కార్డు కలిగిన ప్రతి జాబ్ కార్డు వారికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఉపాధి కార్మికులు చేస్తున్న పని ప్రదేశంలో గురువారం ఉదయం మొవ్వలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఏపి వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు మాట్లాడుతూ పై సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీ రాజధాని అమరావతి తాడేపల్లిలో ఉన్న కమీషనర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాలో పాల్గొని జయప్రదం చేయాలని ఉపాధి కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది.

అయ్యంకి గ్రామంలో గురువారం ఉదయం ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్న పని ప్రదేశంలో కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమం సంబంధించిన కరపత్రం కార్మికులతో కలిసి ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి కార్మికులు, మేట్లు పాల్గొన్నారు.

Leave a Reply