జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి అభిప్రాయ సేకరణ

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్ష పదవి కోసం నాయకులు నుండి అభిప్రాయ సేకరణచేపట్టారు. జిల్లా కేంద్రంలోని హోటల్లో నిర్వహించిన ఈ అభిప్రాయ సేకరణ కర్పానికి వికారాబాద్ తాండూర్ పరిగి నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు హాజరయ్యారు.
గతంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు అన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తొలగించగా ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో తాండూర్ చెందిన రమేష్ కుమార్ వికారాబాద్ చెందిన యువరాజ్ సదానంద రెడ్డి తదితరులు ఉన్నారు. నాయకులు నుండి అభిప్రాయ సేకరణ మంత్రం పార్టీ రాష్ట్ర వర్గానికి ప్రతిపాదనలు పంపించనున్నారు
