అదనపు కలెక్టర్ సంగీత బాధ్యతలు స్వీకర‌ణ‌

అదనపు కలెక్టర్ సంగీత బాధ్యతలు స్వీకర‌ణ‌

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా నూత‌న అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టీఎల్ సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అదనపు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం, రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆమె అధికారులతో పరిచయం చేసుకున్నారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడంపై అధికారులు దృష్టి పెట్టాల‌ని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. టీఎల్ సంగీత గతంలో పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం రెవెన్యూ వ్యవహారాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మరింత సులభతరం చేయ‌నుంది.