చిన్నచిన్న సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి..

చిన్నచిన్న సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి..

జుక్కల్ లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
కేజీబీవి విద్యార్థినిలతో మధ్యాహ్న భోజనం
ఇందిరమ్మ గృహాలు పరిశీలన

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : చిన్న చిన్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని,ప్రజలు చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. ఆయన జుక్కల్ మండల కేంద్రంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించడమే కాకుండా జుక్కల్ లో గల ఆక్సిజన్ పార్క్ ను పరిశీలించారు.అక్కడ చెట్లకు నీరు పోశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. విద్యార్థినిలు కలెక్టర్ కుస్వాగతం పలికారు.

విద్యాలయంలో విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని, మెనో ను పరిశీలించడమే కాకుండా విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. జుక్కల్ మండలంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. జుక్కల్ లో పలువురు ఇందిరమ్మ గృహాలు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న అనంతరం సాంకేతికంగా మంజూరి రద్దు కావడంతో ఆవేదన చెందిన లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఈసమస్య జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉందని పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.రూర్బన్ పథకంలో మంజూరైన ఆడిటోరియం పూర్తి హంగుళాలతో నిర్మాణం కాకపోవటంతో ప్రస్తుతం అది వినియోగంలో వచ్చే విధంగా నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు కేజీబీవీలు నూతన బోరు ఏర్పాటు చేసి విద్యార్థినిలకు మినరల్ వాటర్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మండల స్థాయి అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏమైనా పెద్దసమస్య ఉంటే అధికారులే డివిజన్, జిల్లా స్థాయిలో తీసుకెళ్లి పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. జుక్కల్ సరిహద్దు ప్రాంతంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా కృషి చేయడమే కాకుండా, అభివృద్ధికి తమ వంతు సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తోపాటు జడ్పీ సీఈఓ చందర్ నాయక్, పిడి హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డిపిఓ మురళి, పిడి డిఆర్డిఏ సుదర్శన్ తో పాటు జుక్కల్ తాసిల్దార్ మారుతి, ఎంపీడీఓ బీ. శ్రీనివాస్ డిప్యూటీ తాసిల్దార్ హేమలత, ఎంపిఓ రాము, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ పీఆర్ డిప్యూటీ మధుబాబు, ఆర్ డబ్ల్యూఎస్ డిప్యూటీ ధర్మేందర్, సురేష్ గొండ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.