ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం..
- కానూరు దంపతుల సేవాభావం
- భక్తులకు నిత్యాన్నసేవకు విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి కానూరు, చలసాని నగర్‌కు చెందిన వై. శ్రీరామ్, మేఘన చౌదరి దంపతులు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.
దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు రామబ్రహ్మం సూచన మేరకు, దాతలు స్వయంగా ఆలయ అధికారులను కలిసి ఈ విరాళాన్ని సమర్పించారు. భక్తులకు నిత్యం ఉచితంగా భోజనం అందించే అన్నదాన కార్యక్రమానికి ఈ విరాళం ఉపయోగపడనుంది. వీరికి అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వానంతరం ఎఈఓ ఎన్ రమేష్ టెస్ట్ బోర్డ్ సభ్యులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
