మత సామరస్యానికి ప్రతీక విజయవాడ

మత సామరస్యానికి ప్రతీక విజయవాడ
భవానిపురం,ఆంధ్రప్రభ : మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అల్లినగర్లో మస్జీద్ ఏ అలీ మసీదుకు టిడిపి బిసి విభాగం రాష్ట్ర నాయకులు గుర్రం కొండా నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చిని పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ….పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కులాలు,మతాలు వారు కలసి ఉంటారని, మత సామరస్యంకు ప్రతీకగా ఉంటారన్నారు. గడచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ వచ్చిందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లీం సోదర, సోదరీమణులే కారణమన్నారు. ముస్లీంలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం, చిట్టినగర్లలో షాదీఖానాల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటానని, నిధులు కేటాయింపులు చేస్తానన్నారు.

ఏ మసీదు అభివృద్ధికైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని వివరించారు. మత సామరస్యంను చాటుతూ తన డబ్బు వెచ్చించి టిడిపి బీసీ నేత గుర్రం కొండ మసీదుకు ఆర్చి నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, 46 డివిజన్ ప్రెసిడెంట్ పోతినీడు లోకేష్ , 47 డివిజన్ ప్రెసిడెంట్ నాగోతి రామారావు , కార్యదర్శి ధనాల శ్రీను ,47వ డివిజన్ జనరల్ సెక్రెటరీ కట్టా సాంబయ్య , మైనార్టీ నాయకులు షేక్ అర్షద్, ఫైజాన్, 52 డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి , 45వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ప్రేసిడెంట్ పేరం సత్యనారాయణ 52 డివిజన్ ప్రెసిడెంట్ ఈగల్ సాంబ, 51 డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు , నగరాలు కార్పొరేషన్ డైరెక్టర్ బెవర సాయి సుధాకర్ , రెల్లి సంఘం నాయకురాలు తుపాకుల రమణమ్మ , 35 డివిజన్ అధ్యక్షులు షేక్ నంద కుమారి, 50 డివిజన్ అధ్యక్షులు కొప్పుల అరుణశ్రీ, కో క్లస్టర్ ఇన్ఛార్జి కొప్పల గంగాధర్ రెడ్డి , సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు , తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ, ఉపాధ్యక్షులు కే భవాని శంకర్ , నాయకులు కసిమికోట మల్లేశ్వరి దేవలక్ష్మి తదితరులు పాల్గొనగా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు, నమాజ్ , డిన్నర్ కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొని మసీదు కమిటీ పెద్దలకు, ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
