సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు

సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ కార్పోరేషన్,ఆంధ్రప్రభ : సెలవు దినాలలో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 50% వడ్డీ మాఫీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం విజయవాడ నగర పరిధిలోగల చిట్టినగర్ కలరా హాస్పిటల్, హెచ్ బి కాలనీ, విఎంసి ప్రధాన కార్యాలయం, సత్యనారాయణపురం ఎకెటిపి స్కూల్, సింగనగర్ రైతు బజార్, పైకాపురం అపనా బజార్, పటమట సర్కిల్ కార్యాలయం, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, బి.వి.ఆర్ కాంప్లెక్స్ పటమట, సాయిబాబా గుడి వద్ద, కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్ వద్ద ఉన్న క్యాష్ కౌంటర్లు సెలవదినాలలో కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన విన్నవించారు.
