డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన

డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన

వంగూర్, ఆంధ్రప్రభ : డిండి చింతపల్లి గ్రామానికి చెందిన రైతు పెరుమల వెంకట్ నారి జీవనాధారమైన పాడి ఆవు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. తన ఇంటి సభ్యురాలిలా, తన పిల్లలలా చూసుకున్న ఆవు కళ్ల ముందే ఇలా మృతి చెందడం రైతు వెంకట్ నారి తీవ్రంగా కలచివేసింది. ఆవు పక్కనే నిలబడి కన్నీరుమున్నీరయ్యారు.

పేద రైతుకి పశువే ఆస్తి… ఆ పశువే ఆదాయం… అలాంటి జీవనాధారం ఒక్కసారిగా కోల్పోవడం అనేది మాటల్లో చెప్పలేని బాధ. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధిత రైతుకు న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించాలని బాధిత రైతు వెంకట్ నారి కోరుకుంటున్నారు.

Leave a Reply