ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం,మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ తాటి శ్రీనివాస్ హాజరై గృహప్రవేశాన్ని నిర్వహించారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు భీమనపల్లి లక్ష్మి,ఖమ్మం చంద్రయ్య,దుబ్బాక చంద్రయ్య,దుబ్బాక యాదమ్మ,పగిళ్ల శివరాణి, చింతకాయల లలిత,గుర్రం ప్రమీల,కురుమతి కలమ్మ దంపతులు తమ సొంత ఇంటిలోకి అడుగుపెట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు.
సొంతింటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్పంచ్ నామని జగన్నాథం మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగపడుతుందని,రానున్న రోజుల్లో మరింత మంది పేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,వార్డు సభ్యులు యిడం మణెమ్మ,పెద్దగాని నరేందర్, మొద్దు గణేష్,జూలూరు పురుషోత్తం,యిడం గణేష్, పున్న కిషోర్,లడే యాదయ్య,పగిళ్ల శంకర్,పున్న శివ,పంచాయతీ కార్యదర్శి ఎం డి షఫీ,కారోబార్ భీమగాని యాదయ్య,బానవత్ సురేష్,ఎర్ర కుమార్,చిలువేరు వేణు,మొద్దు నవీన్, ఖమ్మం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
