పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ..

పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని కాచవరం గ్రామంలో పేదలు, పారిశుధ్య కార్మికులకు మండల ప్రభుత్వ ఖాజీ షేక్ నాగుల్ మీరా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు సంపాదించిన దాంట్లో కొంత జకాత్ ద్వారా పేదలకు అందజేయాలని ప్రవక్త నిర్దేశించారన్నారు.
పేదలు కూడా పండుగ చేసుకున్నప్పుడే పండగ అవుతుందని… మనకున్న దానిలో సాటివారికి సహాయపడుతూ ఉండాలని కోరారు.
