నవోదయ ప్రవేశ పరీక్షల్లో పొట్లూరి విద్యార్థి ప్రతిభ…
నవోదయ ప్రవేశ పరీక్షల్లో పొట్లూరి విద్యార్థి ప్రతిభ…
శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో మండలంలోని పొట్లూరు హెచ్‌సి పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థి పోపూరి ప్రకుల్ పాల్ పల్నాడు జిల్లాలో మొదటి స్థానం సాధించినట్లు ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు నిర్వహించగా 98.75 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం సాధించడం మన మండలానికి గర్వకారణంగా ఉందని, అందుకు గాను విద్యార్థిని అభినందించారు. హెచ్‌సి పాఠశాల హెచ్ఎం పేరం సుశీల, ఉపాధ్యాయులు నెమలి కంటి ప్రవీణ్, కోటేశ్వరమ్మ, పీరాభి తదితరులు ప్రకుల్ పాల్ అభినందనలు తెలిపారు.
