Hero Nikhil | స్వయంభు ఏమైంది..?
Hero Nikhil | స్వయంభు ఏమైంది..?
Hero Nikhil | స్వయంభు రిలీజ్ పై అనిశ్చితి ఎందుకు?
ఏప్రిల్ 10 రిలీజ్ ప్లాన్ మారిందా?
ఇతర సినిమాల ప్రభావం ఎంత?
ట్రైలర్ పై స్వయంభు టీమ్ ఫోకస్
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
నిఖిల్ కెరీర్‌కు స్వయంభు ఎంత కీలకం?
Hero Nikhil | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హీరో నిఖిల్.. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించడంతో.. నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా స్వయంభు అంటూ భారీ సినిమా చేసాడు. ఈసారి నిఖిల్ టార్గెట్.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ టార్గెట్ (Target) గా సినిమా చేసాడు. అయితే.. ఈ మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు నిఖిల్ టెన్షన్ పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఏమైంది..?

Hero Nikhil | ఏప్రిల్ 10న స్వయంభు రావడం లేదా..?
పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ సినిమాలు తీస్తే.. చెప్పిన డేట్ కి రిలీజ్ (Release) చేయడం సాధ్యం కావడం లేదు. ఎంత ముందుగా ప్లాన్ చేసినా.. ఏదో కారణం వలన పోస్ట్ పోన్ తప్పడం లేదు. నిఖిల్.. పాన్ వరల్డ్ మూవీ చేయాలని స్వయంభు కోసం చాలా హార్డ్ వర్క్ అండ్ హామ్ వర్క్ చేశాడు. ఇటీవల టీజర్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 10న ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు నిఖిల్ ఆలోచనలో పడ్డాడట. కారణం ఏంటంటే.. ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా యంగ్ హీరోలు సోలో రిలీజ్ చేస్తేనే పోటీ లేకుండా మంచి ఫలితం రావడానికి ఛాన్స్ ఉంటుంది.

Hero Nikhil | అందుకే.. డేట్ మారబోతుందా…?
ఏప్రిల్ 3న శర్వానంద్ బైకర్ మూవీ (Movie) రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 10న అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పబ్లిసిటీతో మొదటి రెండు వారాలు హోరెత్తిపోతాయి. పాజిటివ్ టాక్స్ వస్తే.. సోషల్ మీడియాలో మరింతగా ప్రచారం దొరుకుతుంది. అందుచేత వీటికి మించిన పబ్లిసిటీ స్వయంభు టీమ్ చేయాలి. ముఖ్యంగా ట్రైలర్ మీద దృష్టి పెట్టాలి. ఈ ట్రైలర్ అంచనాలకు మించి ఉండాలి. విజువల్స్ వావ్ అనిపించేలా కనిపించాలి. అలా చేస్తేనే.. జనాల్లోకి బాగా వెళుతుంది. మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 30న చరణ్ పెద్ది రిలీజ్ ఉంది. అందుచేత ఏప్రిల్ 10న రావాలి అనుకున్న స్వయంభు ఏప్రిల్ 17న రావాలి అనుకుంటుందట. అందుకనే.. ఈ మూవీ ప్రమోషన్స్, రిలీజ్ గురించి తెగ టెన్షన్ పడుతున్నాడట. మరి.. నిఖిల్ కష్టానికి స్వయంభు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

