Bail | జర్నలిస్టులు రేవతి, తన్వీ లకు రిలీఫ్

హైదరాబాద్ – జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్‌లకు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. నాంపల్లి కోర్టు ఇరువురికి బెయిల్ మంజూరు చేసింది.. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు వారిని ఆదేశించింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్‌లపై మార్చి 12న హైదరాబాద్ సీసీఎస్‌లో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తు ట్రోలింగ్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలియజేశారు.

ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఇద్దరు యూట్యూబ్ జర్నలిస్టులు నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు సోమవారం వాదనలు వింది. ఈ నేపథ్యంలో ఇరువురు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *