సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 హైకోర్టుల నుండి 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు హైకోర్టు జడ్జీలకు బదిలీ చేశారు.
ఏపీకి బదిలీపైన ఒక న్యాయమూర్తి రాగా, తెలంగాణకు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేశారు. చెన్నై నుంచి జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కర్ణాటక నుంచి జస్టిస్ సి.సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి…, పాట్నా నుంచి జస్టిస్ అనిరెడ్డి అభిషేక్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఇక తెలంగాణ నుంచి న్యాయమూర్తి సుజోయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

