మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి..

మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ శాఖా గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్యగిరిని నియమిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.డీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తీ జారీ చేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యే మందుల సామేల్ హైదరాబాద్ లోని తన నివాసంలో కోమటి మత్స్యగిరికి అందజేశారు. ఈ సందర్బంగా కోమటి మత్స్య గిరికి శుభాకాంక్షలు తెలియజేసి మోత్కూర్ శాఖా గ్రంథాలయ అభివృద్ధికి ఎళ్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం. డీ. అవైస్ ఉర్ రెహమాన్ చిస్తీ తోడ్పాటుతో మోత్కూర్ శాఖా గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతామన్నారు.

మోత్కూర్ గ్రంథాలయ అభివృద్ధికి 12 వేల పుస్తకాల సేకరణ, రూ10 లక్షలతో అదనపు రీడింగ్ హాల్ ఏర్పాటుకు కృషి చేసిన మత్స్య గిరిని ఎమ్మెల్యే సామెల్ అభినందించారు. త్వరలో ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా చైర్మన్ తో పాటు పాల్గొని గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ సందర్బంగా తన నియామకానికి సహకరించిన కోమటి మత్స్య గిరి ఎమ్మెల్యే సామెలుకు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిస్తీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply