ప్రకృతి వ్యవసాయం పై రైతులు దృష్టి పెట్టాలి.

ప్రకృతి వ్యవసాయం పై రైతులు దృష్టి పెట్టాలి.

కుంటాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలంలోని కుంటాలతో పాటు కల్లూరు ఓలా సూర్యాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. తాను 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని, ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహకం అందించాలని కోరారు. ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రకృతి వ్యవసాయంతో ఎంతో లాభదాయకమైన పంటలు వేసుకోవచ్చని చెప్పారు.

మండల వ్యవసాయ అధికారులు సూచనల మేరకు రైతులు ప్రతి ఒక్కరూ పంటలను సాగు చేసుకుని తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడులు సాధించి లాభదాయకమైన పంటలు సాధించాలని సూచించారు. అనంతరం రైతులకు భూసార పరీక్ష కార్డులు, ప్రకృతి వ్యవసాయ కిట్లను మండల వ్యవసాయ అధికారి విక్రమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు జక్కుల గజేందర్, పెంట వార్ దశరథ్, కుబీర్ రాజన్న, కట్ట రవి, వ్యవసాయ అధికారి విక్రం, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు హర్షిత, గణేష్, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.