విద్యుత్ ఘాతు కానికి పశువుల మృతి
విద్యుత్ ఘాతు కానికి పశువుల మృతి
సిర్పూర్ (యు ),ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పుల్లారా గ్రామపంచాయతీలో సోమవారం విద్యుత్ ఘాతుకానికి గురై రెండు పశువులు మృతి చెందినట్లు పుల్లార సర్పంచ్ వెడ్మ జంగు భాయి దత్త తెలిపారు. ఆ గ్రామానికి చెందిన గిరిజన ఆత్రం సోనే రావు, ఆత్రం చందన్ షా లకు ఒక ఎద్దు ఒక ఆవు నేతకు వెళ్లి విద్యుత్ స్తంభం వైర్లు తెగిపడడంతో ఆ రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని సర్పంచ్, బాధిత రైతులు తెలిపారు.
ముందే పంటలు పండగ రైతులు అప్పుల పాలు అయ్యి ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్ ఘా తుకం వల్ల వేలాది రూపాయల విలువగల పశువులను కోల్పోవడం జరిగిందని ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా కానీ ఐటిడిఎ ద్వారా కానీ బాధిత రైతులకు న్యాయం చేసి ఆర్థిక సాయం అందించాలని పుల్లారా సర్పంచ్ జంగు బాయి దత్త బాధిత రైతులు కోరారు.
