Cooking Gas | అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉంది

Cooking Gas | అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉంది
Cooking Gas | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100శాతం ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ దగ్గర భారతీయ నౌకలు కూడా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచించింది. మున్ముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్‌ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు, గ్యాస్ దొరుకుతుందా, లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది. దేశంలో గృహ అవసరాలకు తగిన వంటగ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది.
