993 rupees | గ్యాస్ బండ..భారం !

993 rupees | గ్యాస్ బండ..భారం !
993 rupees | వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.వెయ్యి పెంపు
రూ. 2,078.50 ఉండగా ప్రస్తుతం అ ధర రూ.3,024
గృహ వినియోగదారులపై కరుణ.. రేట్లు యథాతథం
ఇక హోటల్స్ టిఫిన్స్, భోజనం ధరలు ఆకాశానికే..
993 rupees | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 993 రూపాయలు పెంచుతున్నట్లు గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన రేట్లు ఈ తెల్లవారు జాము నుంచి అమలులోకి వచ్చాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన రెండో రోజే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతం దాదాపు రూ. 1,000 వరకు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హోటళ్లు, రెస్టారెంట్లు నడిపే వారిలో ఆందోళన
19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో 993 రూపాయల మేర పెరిగింది. ఇతర నగరాల్లో దీని ధర 1,000 రూపాయల వరకు పెరిగింది. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లను నడిపే వారిలో ఆందోళన నింపింది. ఇక ఇంత ధర పెరగడంతో టిఫిన్స్, భోజనం ధరలను హోటల్స్ నిర్వాహకులు పెంచక తప్పని సరి.. ఇప్పటికే గ్యాస్ సంక్షోభం అంటూ చిన్నచిన్న బండ్లపై టిఫిన్ వ్యాపారులు 30 రూపాయిలు అమ్మే వాటిని 50కి పెంచేశారు.. ఇప్పుడు సిలిండర్ ధర వెయ్యి పెరగడంతో బండ్ల వ్యాపారులు ఆ స్థాయిలోనూ ధరలు పెంచడం తథ్యం.
ఢిల్లీలో 19కేజీల సిలిండర్ రూ. 3,071.50
ఈ పెంపుతో ఢిల్లీలో నిన్నటివరకు 2,078.50 ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర ఎకాఎకిన రూ. 3,071.50కి చేరింది. ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ ధరలు గణనీయంగా పెరిగాయి. కోల్‌కతాలో 994 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 2,208 నుంచి రూ. 3,202కి చేరుకుంది. ఇదే మాదిరిగా ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,024 కు చేరుకుంది. గతంలో ఇది రూ. 2,031కి లభించేది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర 3,237కి చేరింది. ఇదే అత్యధికం. ఇక్కడి పాత ధర రూ. 2,246.50గా ఉండేది.
గృహ వినియోగదారులకు ఊరట
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉండటంతో సామాన్యులకు కొంత వరకు ఊరట లభించింది. గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం.. ఢిల్లీ- రూ. 853.00, గుర్గావ్- రూ. 861.5, అహ్మదాబాద్- రూ. 860, జైపూర్- రూ. 856.5, పాట్నా- రూ. 942.5, ఆగ్రా- రూ. 865.5, మీరట్- రూ. 860, ఘజియాబాద్- రూ. 850.5, ఇండోర్- రూ. 881, భోపాల్- రూ. 858.5, లూధియానా- రూ. 880, వారణాసి- రూ. 916.50 పైసలు, లక్నో-రూ. 890.50 పైసలు, ముంబై- రూ. 852.50 పైసలు, పూణే- రూ. 856, హైదరాబాద్- రూ. 905, బెంగళూరు 855.50 పైసలు ఉంటోంది.
CLICK HERE TO READ MORE 349 kg | రూ.1,745 కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
