ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం

ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య కార్మికులు సంపూర్ణ ఆరోగ్య వంతంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.ఆదివారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోనీ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, కార్యాలయ ఉద్యోగులకు జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ ఆరోగ్య శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా సందర్శించి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ వైద్య పరీక్షలు చేసి, తీవ్ర స్థాయిలో చికిత్స అవసరం ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయాలన్నారు. అలాగే అవసరం అయిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మందులు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ డి. మహేశ్వర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి డా. అశోక్ కుమార్, 10వ వార్డు కౌన్సిలర్ నీరటి రజిని, డిప్యూటి డీఎంహెచ్ఓ అశోక్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్‌పెక్టర్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.