పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను శనివారం ఐపీఎస్ అధికారి నెహ్ర మనీషా ట్రేని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యా లను పరిశీలించారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని పేర్కొన్నారు. 10వ తర గతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని పేర్కొ న్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ వంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో నూ చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ తనిఖీలో స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి. వేణు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply