తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు..

తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కు శనివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దర్శనార్థం వచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చిన గవర్నర్ కు దేవస్థానం కార్యనిర్వాణాధికా శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. ఉదయాన్నే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ని ప్రత్యేకంగా దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
దేవాలయం లో గవర్నర్ దంపతులు అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానంలో చెందిన చిత్రపటాన్ని కార్య నిర్వాణ అధికారి గవర్నర్ కు బహుకరించారు. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల అధిక సంఖ్యలో శ్రీశైలం రావటం మొదలుపెట్టారు. గవర్నర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం రెండు రాష్ట్రాలతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

