మాయమైన విద్యార్థినీ విద్యార్థుల 15 మొబైల్ ఫోన్లు…
మాయమైన విద్యార్థినీ విద్యార్థుల 15 మొబైల్ ఫోన్లు…
పరీక్ష రాసి వచ్చే లోపల స్కూటీలో ఉన్న ఫోన్లో మాయం…
పోలీసులకు ఫిర్యా దు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పి.యస్.సి, కె.వి.యస్.సి కళాశాల నందు సోమవారం డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు.
ఎగ్జామ్స్ సెంటర్లో విద్యార్థుల మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున అందరూ ఒకే కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కావడంతో తమ15 మొబైల్ ఫోన్లు అన్నింటిని ఒక స్కూటీ డిక్కీలో పెట్టారు. మూడు గంటలు పరీక్షలు రాసి వచ్చి చూడగా 15 మొబైలు ఫోన్ లు కనిపించలేదు. మొదట పరిక్ష కేంద్రంలో ఫిర్యాదు చేశారు.

కళాశాల నిర్వాహకులు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు విద్యార్థినీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సిఐ ఫిర్యాదును స్వీకరించి తప్పనిసరిగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండి కూడా మొబైల్ ఫోన్లు దొంగిలించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు తమ ఫోన్లో దొంగలించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థిని విద్యార్థులు పోలీసులను కోరారు.
