ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు

ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను కుమ్మరి సంఘం ఆధ్యర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు గంగధారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని బస్టాండ్ ముందు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆమె తెలుగు సాహిత్యానికి అందించిన విశేష సేవలను స్మరించుకుంటూ ఆమె రచనలు,సామాజిక ఆలోచనలను కొనియాడారు.మొల్లమాంబ తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగధారి పరమేశ్వర్,జిల్లా మీడియా విభాగం అధ్యక్షులు గంగధారి శ్రావణ్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి జీవిలకపల్లి సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు శనిగరం హరీష్,కొరుటూరి భిక్షపతి,గంగాధరి ఇస్తారి,కొరుటూరి బాలరాజు,గంగాధరి సత్తయ్య,కొరుటూరి నరసింహులు,కట్కూరి సిద్ధులు,గంగాధరి సాయికిరణ్,తాడూరి భాస్కర్,కొరుటూరి ఉపేందర్,గంగాధరి మహేందర్,గ్రామ అధ్యక్షులు గంగాధరి పరమేష్,శనిగరం రవీందర్,తాడూరి గణేష్,నిడిగొండ ఆంజనేయులు,గంగాధరి శ్రీనివాస్,కట్కూరి బాలస్వామి,కొరుటూరి శ్రీనివాస్,కట్కూరి రవి,తేరాల సిద్ధులు పాల్గొన్నారు.
