ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

హంద్రిక శ్రీ జగద్గురు లింగప్ప తాత

ఊట్కూర్,ఆంధ్రప్రభ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని కర్ణాటక రాష్ట్రంలోని హంద్రిక శ్రీశ్రీశ్రీ జగద్గురు లింగప్ప తాత ఉద్భోదించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనితిప్రాస్, పల్లి శ్రీ అమ్మపల్లి దేవేంద్రప్ప తాత జాతర వార్షికోత్సవానికి హాజరై ప్రవచనాలు చేపట్టారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవభక్తి పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత జీవనస్థితిగతులు సుఖ సంతోషాలతో ఉంటారనిఅన్నారు. నిత్యం దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు చేపట్టడం వల్ల ఆ గ్రామాలు సిరిసంపదలతో పాడిపంటలతో సుఖశాంతులతో వెళ్లి విరుస్తాయనిఅన్నారు. ప్రతి ఏడాది దేవేంద్రప్ప తాత జాతర వేడుకల్లో భాగంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అన్నారు.

శుక్రవారం రాత్రి భక్తుల అగ్నిగుండ ప్రవేశం భజన సంకీర్తన, ఈనెల 14న శనివారం స్వామి వారి పల్లకి సేవ, రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు లింగప్ప తాత దేవాలయంలోని శివలింగానికి అభిషేకంచేశారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అన్నదానంతో పాటు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జాజాపూర్ పూజారి బాబు తదితరులు పాల్గొన్నారు.