తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం..

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సర్వ సిద్ధం..

పదవ తరగతి పరీక్షల ఏర్పాట్ల పరిశీలన
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఎంఈఓ ఎర్ర లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎంఈఓ తెలిపారు.

పదిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించి జిల్లాలో గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కొత్తపల్లి సర్పంచ్ నరసింహ అన్నారు. శుక్రవారం నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి నుండి పులిమామిడి సెంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లే కొత్తపల్లి విద్యార్థులకు ఆటో సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పదవ తరగతి పరీక్ష లో అత్యధిక మార్కులు సంపాదించి పాఠశాల గురువుల విద్యార్థుల తల్లిదండ్రుల పేరును గొప్ప పేరు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కిషోర్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం మహేష్ రమేష్ గోపాల్ నాగరాజు గజలప్ప హర్షద్ మనోహర్ ఉమాదేవి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మండల విద్యా శాఖ అధికారి బానోత్ జూంకిలాల్
జూలూరుపాడు,ఆంధ్రప్రభ పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యా శాఖ అధికారి బానోత్ జూంకిలాల్ తెలిపారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణ అధికారులతో ఎంఇఓ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బానోత్ జూంకిలాల్ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న 348 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు.బాలురు 138 మంది,బాలికలు 210 మంది పరీక్షలు వ్రాసేందుకు సిద్ధమౌతున్నారు.
జూలూరుపాడు జెడ్పీహెచెస్,వెంగన్నపాలెం గ్రామంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఒక్కొక్క పరీక్ష కేంద్రానికి పదిమంది ఇన్విటేటర్స్ ను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్,టాయిలెట్స్ సౌకర్యంతోపాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. అత్యవసర సమయాల్లో విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలను జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకోవాలని ఎంఇఓ సూచించారు.రెండు పరీక్ష కేంద్రాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జూంకీలాల్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తంబళ లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని రెండు సెంటర్లలో ఏర్పాట్లను మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ పరిశీలించడం జరిగినది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు 170 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాయిపోతున్నారు మరొక సెంటరు సెయింట్ ఆంటోని పాఠశాల నందు 150 మంది బాలి బాలికలు పరీక్ష రాయపోతున్నారు మన మండలంలోని మొత్తం విద్యార్థులు సంఖ్య 350 మంది అందులో బాలికలు 210 బాలురు 138 మంది ఈ రెండు సెంటర్లలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సక్రమంగా ఉండేలా పర్యవేక్షించడం జరిగినది అని ఎం యు గారు తెలియజేసినారు. ఇన్విజిలేటర్ తో సిఎస్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగినది ఈ రెండు సెంటర్లలో త్రాగునీరు టాయిలెట్స్ ను 8మరియు విద్యుత్ సౌకర్యం అన్ని సౌకర్యములను పర్యవేక్షించడం జరిగినది పరీక్షలో సీసీ కెమెరా పర్యవేక్షణలో నిర్వహిస్తారని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బి జుంకీలాల్ గారు తెలియజేశారు.

రాయపోల్‌లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పూర్తి
రాయపోల్, ఆంధ్రప్రభ : నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో రాయపోల్ మండలంలోని పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను మండల విద్యాధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, త్రాగునీటి వసతి, తరగతి గదుల ఏర్పాట్లు తదితర అంశాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పరీక్షా కేంద్రంలో 180 మంది విద్యార్థులు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ పరీక్షా కేంద్రంలో 219 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని, రాయపోల్ మండలాన్ని ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో నిలిపి మండలానికి మంచి పేరు తీసుకురావాలని మండల విద్యాధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. రాయపోల్ మండలంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి ఆయన “విజయీభవ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

శారాజీపేట హైస్కూల్లో .. పరీక్షా సామాగ్రి పంపిణీ
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శారాజిపేట జడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థి యంబ భారతీ రాజా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, సామాగ్రిని శుక్రవారం అందజేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు టి జ్యోతి రాజ్, ఉపాధ్యాయులు పి రాజేశ్వరరావు, సంజీవరెడ్డి, కాంతారావు, గడసంతల మధుసూదన్, దయాకర్, శ్రీనివాస్, దివాకర్, ఎలేంద్ర పాల్గొన్నారు.
