క్షణికావేశక నిర్ణయాలకు దూరంగా ఉండాలి..

మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సతీష్ ను కోల్పోవడం చాలా బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సతీష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలో ఇటీవలే మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సతీష్ కుటుంబాన్ని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. యువత క్షణికా ఆవేశ నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్త సతీష్ ను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, తెలంగాణ విద్యుత్ నియంత్ర కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నాయకులు మంథని సత్యం, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు ఉన్నారు.
