రైతుబంధు నిధులు విడుదల చేయాలి..

ఉట్నూర్ , ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు కూలీలకు 15వేల సహాయ నిధులు విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ అన్నారు. ఆయన గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని చేతకాకపోతే హామీలు ఎందుకు ఇవ్వాలని ఆయన విమర్శించారు. రైతుబంధు సహాయ నిధులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేశారని చేతకాకపోతే హామీలు ఎందుకు ఇచ్చారని ఆయన అన్నారు.

ఉపాధి హామీ రైతు కూలీలకు15 వేల రూపాయలువెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని అయని హెచ్చరించారు.ఈ సమావేశంలో బంజారా జాగృతి భజన మండలి జిల్లా కార్యదర్శి రాథోడ్ అమర్ సింగ్,తండా నాయక్ రాథోడ్ భగవాన్ దాస్,జాదవ్ తుకారాం, జాదవ్ రామేశ్వర్, జాదవ్ మెర్సింగ్, రాథోడ్ ధన్లాల్,జగదీష్ జాదవ్ తో పాటు ఆత్రం రాజు మడవి గంగాధర్ , భూమన్న నారాయణ రైతులు కూలీలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply