మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు..

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు..
పార్ధివ దేహానికి పూలమాల అర్పించిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు..
రైతు కుటుంబం నుంచి ఎదిగి ఉన్నత పదవులు.. అధిరోహించిన మహానేతగా స్మరణ..
విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మరణంపై పలు వర్గాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పార్ధివ దేహానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు పార్ధివ దేహానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు బుధవారం రాత్రి నివాళులు అర్పించారు.
హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఆంజనేయులు పూలమాల వేసి గౌరవాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కావూరి సాంబశివరావు రైతు కుటుంబంలో జన్మించి కృషి, పట్టుదలతో ఉన్నత రాజకీయ స్థానాలను అధిరోహించిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన ఆయన జిల్లాలో సామాజిక సేవకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు.
ప్రత్యేకంగా రైతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఆంజనేయులు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహానీయ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. కావూరి సాంబశివరావు మరణం దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
