YS Jagan | దోచిపెట్టడమే సరిపోతుంది…
YS Jagan | దోచిపెట్టడమే సరిపోతుంది…
YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సూపర్ -6 సూపర్ -7 లేవని, చంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటిందన్నారు. మట్టి, ఇసుక, భూములు, లిక్కర్ దేన్నీ వదలడం లేదని, అన్నింట్లో దోపిడీనే జరుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. వైజాగ్లో జరిగిన భూదోపిడీనే వీళ్ల దోపిడీకి నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయన్నారు.
తాను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. 2023- 2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు అని, 2023- 2024లో రాబడులు రూ.1,70,767కోట్లు అన్నారు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు అన్నారు. చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమేనన్నారు. చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు అని, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయన్నారు. చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగిందని, ద్రవ్య లోటు 30శాతం పెరిగిందన్నారు.
కోవిడ్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా హామీలు నెరవేర్చామన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారన్నారు. ఓవైపు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తారు.. అప్పులు చేస్తారన్నారు. ఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారన్నారు. కాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లు కానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్ల అన్నారు. సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉందన్నారు.
16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలకు ఒరిగింది సున్నా అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్ అన్నారు. 2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారన్నారు. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉందన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు అన్నారు. తమ హయాంలో చేసిన అప్పుల్లో 96శాతం అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారన్నారు. తమ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమేనని జగన్ అన్నారు.
