విద్యార్థుల అభివృద్ధి కోసం చైత్ర ఫౌండేషన్..
విద్యార్థుల అభివృద్ధి కోసం చైత్ర ఫౌండేషన్..
నిస్వార్థంగా చైత్ర ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయం చీమలదరి సర్పంచ్ కల్పనా హరీష్ కుమార్ రెడ్డి
వికారాబాద్, ఆంధ్రప్రభ : నిస్వార్థంగా విద్యార్థులు అభివృద్ధి కోసం చైత్ర ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయమని చీమలదరి సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మూమెంట్పేట మండలం చీమలదరి గ్రామ లో గల పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల డ్రస్సులు షుజు జామెంట్రీ బాక్స్ పంపిణీ చేశారు. చైత్ర ఫౌండేషన్ ఇర్వాకులు చిరంజీవి రమేష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్ధంగా విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యంగా చైత్ర ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అన్నారు.
