Venkatesh | క్రేజీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
Venkatesh | క్రేజీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
Venkatesh | వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు
సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఎందుకు మారింది?
ఫ్యామిలీ ఎంటర్టైనర్లో యాక్షన్ ట్విస్ట్
ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథలో పెద్ద మలుపు
మహేష్ బాబు ‘అతడు’ సినిమాతో పోలిక ఎందుకు?
దసరా రిలీజ్‌పై ఇండస్ట్రీలో చర్చ
Venkatesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ (Movie) ఆదర్శ కుటుంబం. ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కావాలి కానీ.. ప్లాన్ మారింది. ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి, మహేష్ బాబు మూవీకి లింక్ ఉంది అన్నట్టుగా వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. వెంకీ మూవీకి, మహేష్ మూవీకి ఉన్న లింక్ ఏంటి.? అసలు.. మహేష్ మూవీ ఏంటి..? ఈ క్రేజీ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

Venkatesh | సమ్మర్ ప్లాన్ మారిందా..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరూ కలిసి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు వర్క్ చేశారు. అయితే.. ఆ సినిమాలకు త్రివిక్రమ్ కథ – మాటలు అందించారు. అయితే.. దర్శకత్వం మాత్రం విజయ్ భాస్కర్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ వెంకీని త్రివిక్రమ్ (Trivikram) డైరెక్ట్ చేస్తుండడంతో ఆదర్శ కుటుంబం సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో వెంకీకి జంటగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగపోవడం వలన షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సమాచారం.

Venkatesh | అతడు తరహా మలుపు..
ఇక అసలు విషయానికి వస్తే.. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాత్రమే కాదని.. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ వరకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహా ఉంటూ కడుపుబ్బా నవ్వించేలా ఎంటర్ టైనర్ గా ఉంటుందట. అయితే.. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ షాకింగ్ గా ఉంటుందని.. అక్కడ నుంచి స్టోరీ (Story) సీరియస్ మోడ్ లోకి వెళుతుందని టాక్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు చిత్రంలోని మలుపును గుర్తు చేస్తుందని.. ఆ విధంగా అతడు సినిమాతో ఈ మూవీకి లింక్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదర్శ కుటుంబం సినిమా పై మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. మరి.. వెంకీ, త్రివిక్రమ్.. కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

