28thMay 2026 | తిరుమల సమాచారం..

28thMay 2026 | తిరుమల సమాచారం..
28thMay 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :
ఓం నమో వెంకటేశాయ..
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
2026 మే 27న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. మొత్తం 87,691 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 49,958 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.99 కోట్ల ఆదాయం లభించింది.
అలాగే తిరుమలలో 4.22 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.52 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. వైద్య సేవలను 3,603 మంది భక్తులు వినియోగించుకున్నారు.
భక్తులతో వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కృష్ణతేజ గెస్ట్ హౌస్ బయట వరకు క్యూలైన్ కొనసాగింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
