టీమ్ ఇండియాకు గద్దె క్రాంతి అభినందనలు..

టీమ్ ఇండియాకు గద్దె క్రాంతి అభినందనలు..
పటమట, ఆంధ్రప్రభ : టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న టీం ఇండియాకు టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అద్భుతమైన ఆటతీరు, జట్టు స్పూర్తితో భారత జట్టుకు దేశ ప్రజల అభిమానం లభించిందని, ప్రపంచ వేదిక పై భారత్ గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పారని ఆయన అన్నారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు.
