దేశంలోనే 2వ స్థానంలో ఏపీజీ బ్యాంక్

దేశంలోనే 2వ స్థానంలో ఏపీజీ బ్యాంక్
రాప్తాడు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత రైతులకు ప్రజలకు తక్కువ వడ్డీలకే రుణాలను మంజూరు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నమ్మకమైన సేవలందిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే 2వ స్థానంలో ఉందని జనరల్ మేనేజర్ కె.జనార్ధనరావు పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని మరూరు గ్రామ పంచాయతీ నందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నూతన కార్యాలయంను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ కే.జనార్దన్ రావు రీజినల్ మేనేజర్ పి.శ్రీదేవి హాజరయ్యారు.
ఏపీజీబీ 66వ శాఖ (బ్రాంచ్)ను ప్రారంభించడం చాలా గర్వంగా సంతోషంగా ఉందన్నారు. కొన్ని సంవత్సరాల నుండి గ్రామ రైతులు మహిళలు వృద్ధులు పొదుపు సంఘాలు మామిళ్ళపల్లి బ్రాంచ్ కి వెళ్లి రావడం చాలా కష్టంగా ఉందని అనేక సార్లు తెలియజేశారు.అలాగే మా గ్రామ జనాభా 6 వేలకు పైగా ఉంది కాబట్టి మా గ్రామంలోనే ఏపీజీ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. మీ కోరిక మేరకు మీ గ్రామంలోనే నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేసినాం.

ఇది మా బ్యాంకు కాదు మీ బ్యాంక్ అన్న విషయాన్ని రైతులు మహిళలు ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రీజియన్ పరిధిలో 65 శాఖల ద్వారా మారు మూల ప్రాంతాల్లో సైతం ఏపీజీబీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఇతర అన్ని వర్గాల వాళ్లకు దాదాపు రూ.8.5 లక్షల మందికి బ్యాంకింగ్ సేవలు అందిస్తోందన్నారు. రూ.7,370 కోట్లు టర్నో వర్ చేస్తున్నాము. అందులోను రూ.3,470 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రూ.3,900 కోట్లు రుణాలు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం సిరి 400 డిపాజిట్ పథకం ద్వారా రూ.7.95 శాతం వడ్డీరేటు ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ గోపాల్ నాయుడు మరూరు బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి సీనియర్ మేనేజర్లు జి.చైతన్య కుమార్ సిహెచ్ కె.వి శ్రీధర్ మేనేజర్ బి.రెడ్డప్ప అసిస్టెంట్ మేనేజర్ బి.దర్గన్న క్యాషియర్ ఆర్.ఆదికేశవ నాయుడు సాగునీటి సంఘం అధ్యక్షులు ఉమాపతి టి.వెంకటేష్ గ్రామ సర్పంచ్ నారాయణస్వామి మాజీ డీలర్ సూర్యనారాయణ కొండారెడ్డి కేశవయ్య కదిరప్ప నరేష్ చాపట్ల చెండ్రాయుడు భగవంత్ రామానాయుడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
