ప్రతిభ చూపిన విద్యార్థులు..

ప్రతిభ చూపిన విద్యార్థులు..

బొప్పూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయి ఉపకార వేతన పరీక్షల్లో చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటారు. గత సంవత్సరం డిసెంబరులో నిర్వహించిన ఈ పరీక్షల్లో పాఠశాలకు చెందిన షేక్ దరియావలి, పి. వాత్సల్య, నైనీషా, మేఘన అర్హత సాధించారు. చిలకలూరిపేట మండల స్థాయిలోనే అత్యధికంగా బొప్పూడి పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షలో ఎంపిక కావడం విశేషం.

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఉపకార వేతనం అందజేస్తుంది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. శ్రీనివాస్ రెడ్డిని సర్పంచ్, గ్రామ పెద్దలు, ఎస్‌ఎంసీ చైర్మన్ అభినందించారు.

అలాగే పల్లాడు జిల్లా స్థాయిలో నిర్వహించిన విజ్ఞాన వారోత్సవాల్లో సెమినార్ విభాగంలో బి. వాత్సల్య ద్వితీయ స్థానం సాధించింది. క్విజ్ పోటీల్లో లాస్య, విష్ణు ప్రియ, రాజు విద్యార్థులు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు అభినందించారు.

Leave a Reply