పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్ సైట్ లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్ కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్ టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు.
హాల్ టికెట్ల కోసం https://bse.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా అన్ లైన్ విధనంతో ఇబ్బందులు ఉన్న, వారి దగ్గర నెట్ సెంటర్స్ లేకున్నా అటువంటి వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పొందవచ్చు.
విద్యార్థులు ఏ హాల్ టికెట్ తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు. ఈ సంవత్సరం దాదాపు 5,28,248 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.
