ఆలేరులో హోలీ సంబురాలు..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ విల్లాస్ లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో హోలీ ఉత్సవంలో పాల్గొని రంగులు చల్లుకొని ఆనందించారు. మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హోలీ వేడుకలకు హాజరయ్యారు.