ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి..

ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సీపీఐ(ఎంఎల్) ఎన్డీఆర్ కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆలేరు మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జె స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వస్పరి బాలమల్లేష్ హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నష్టపరిచేలా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐకేఎంఎస్ ఆలేరు మండల నూతన కార్యవర్గాన్ని 9 మందితో ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా కె రాజయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్కే జానీ మియా, కార్యదర్శిగా జె స్వామి, సహాయ కార్యదర్శిగా ఎం గణేష్, కోశాధికారిగా బి మల్లేష్, కార్యవర్గ సభ్యులుగా పి సాయిలు, వి ఉప్పలయ్య మరో ఇద్దరు కోఆప్షన్ సభ్యులని ఎన్నుకున్నారు. ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు పి అంజయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ పి వరలక్ష్మి, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పి రవి, సీపీఐ ఎంఎల్ (ఎన్డిఆర్) ఆలేరు సబ్ డివిజన్ కార్యదర్శి ఏ రాములు, పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి పి సరిత హాజరై మాట్లాదారు. సమావేశానికి ముందుగా అమరులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బి వెంకటేష్, కె రామ నరసయ్య, పి నాగరాజు, పి సునీల్, జి రమేష్, లక్ష్మయ్య, యాదగిరి, అనిత పాల్గొన్నారు.
