హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం..

హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం..
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగగా పేరుగాంచిన హోలీ సందర్భంగా ప్రజలందరూ సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా, ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ పండుగ ప్రతి మనసులో ఆనందాన్ని, స్నేహాన్ని, ఐక్యతను పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. రంగుల పండుగ మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త రంగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నెలకొనాలని కోరుకున్నారు.
నర్సంపేట నియోజకవర్గ ప్రజలు పరస్పర గౌరవ భావంతో, స్నేహపూర్వక వాతావరణంలో పండుగను జరుపుకుంటూ, సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని సూచించారు. యువత మంచి సందేశాలతో, సంస్కృతిని కాపాడే విధంగా హోలీ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రంగుల హోలీ పండుగ ప్రతి ఇంటా ఆనంద కిరణాలు నింపాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
