Power Star | ఉస్తాద్ కథ వెనకున్న అసలు నిజం ఇదే..

Power Star | ఉస్తాద్ కథ వెనకున్న అసలు నిజం ఇదే..

Power Star | ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ నా? ఒరిజినల్ స్టోరీనా?
రీమేక్ పై హరీష్ శంకర్ క్లారిటీ
‘తెరి’ సినిమాతో పోలికలపై వివరణ
‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి టైటిల్ మార్పు ఎందుకు?
కథలో కూడా మార్పులు చేశామా?
ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు

Power Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో.. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తే చూడాలి అనుకున్న అభిమానుల కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతుంది. ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ నెల 26న థియేటర్స్ లోకి రానుంది. అయితే.. ఇది రీమేక్ అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. మేకర్స్ ఎప్పుడూ కూడా ఇది రీమేక్ అని ప్రకటించలేదు. దీంతో ఉస్తాద్ ఓరిజినల్ స్టోరీనా కాదా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఉస్తాద్ రీమేకా..? కాదా…?

Power Star | నేనెందుకు రీమేక్ చేస్తా..

Power Star

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రచారంలో భాగంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా మీట్ లో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ.. హరీష్ ఏం చెప్పారంటే.. తాను గబ్బర్ సింగ్ మూవీలో పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్‌ను తెరి సినిమాలో వాడుకున్నారని.. అలాంటి సినిమాను తాను ఎందుకు రీమేక్ చేస్తానని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రశ్నించాడు. అంతే కాకుండా పోలీస్ నేపధ్యంతో రాసుకున్న కథలు అన్నింట్లోనూ హీరో.. సమాజానికి హాని కలిగించే శక్తుల మీద పోరాటం చేయడం అనేది కామన్ గా ఉంటుందని.. గబ్బర్ సింగ్, తెరి, ఇంకా చాలా సినిమాల్లో ఇలాగే ఉంటుందని.. ఆ రకంగా తెరి సినిమాతో పోలిక ఉంటుందే తప్పితే.. ఆ సినిమాకి, తన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మిగిలిన ఏ పోలిక ఉండదని క్లారిటీ ఇచ్చారు.

Power Star | అందుకే.. టైటిల్ మార్చేసా..

Power Star

అసలు ఈ సినిమాకి ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు. ఆతర్వాత ఈ టైటిల్ కాస్తా.. ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది. అసలు ఎందుకు టైటిల్ మార్చాల్సి వచ్చింది..? టైటిల్ ఒక్కటే మార్చారా..? లేక స్టోరీ కూడా మార్చారా..? అంటే.. అసలు విషయం బయట పెట్టాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. ముందుగా కాలేజీ బ్యాక్ డ్రాప్ తో క్లాస్ గా కథ చెప్పాలి అనుకున్నారట. కానీ.. అందులో మాస్ ఎలిమెంట్స్ పెట్టడం కష్టమైందని చెప్పాడు. అలాగే కొందరు భవదీయుడు అంటే ఏంటి అని కూడా అడిగారని.. టైటిలే అర్థం కానప్పుడు సినిమా ఏం అర్ధమౌతుందని ఆ టైటిలే కాదు.. కథ కూడా మార్చేసామని తనదైన స్టైల్ లో చెప్పాడు ఈ ఉస్తాద్ డైరెక్టర్. సినిమా సక్సెస్ మీద అయితే.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి.. ఉస్తాద్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Power Star

Leave a Reply