KGF 3 | అసలు ఉంటుందా..?

KGF 3 | అసలు ఉంటుందా..?

KGF 3 | కేజీఎఫ్ 3 పై ఇంకా ఎందుకు క్లారిటీ లేదు..?
ప్రశాంత్ నీల్ ఫోకస్ ఇప్పుడు ఏ సినిమాపై..?
యశ్ బిజీ షెడ్యూల్.. కేజీఎఫ్ 3 పై ప్రభావం
కేజీఎఫ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే అనుమానాలు

KGF 3 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేజీఎఫ్‌.. ఈ ఒక్క సినిమాతోనే ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా డైరెక్టర్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కేజీఎఫ్‌ 2 ఎండింగ్ లో కేజీఎఫ్‌ 3 ఉందని హింట్ ఇచ్చారు. ఇక అక్కడ నుంచి పార్ట్ 3 ఎప్పుడు ఉంటుందని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మేకర్స్ మాత్రం కేజీఎఫ్ 3 గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. కేజీఎఫ్ 3 అసలు ఉంటుందా..? ఉండదా..?

KGF 3

KGF 3 | అప్పటి వరుకు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీతోనే..

కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ డ్రాగన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఎన్టీఆర్ కు జంటగా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుంది. అయితే.. ఈ సినిమాని ఈ ఇయర్ లో జనవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత జూన్ 25న విడుదల అని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా ఇంకో సంవత్సరం పోస్ట్ పోన్ చేశారు. 2027 జూన్ 11న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. అంటే.. అప్పటి వరుకు ప్రశాంత్ నీల్ ఈ సినిమా వర్క్ లోనే ఉంటారు.

KGF 3

KGF 3 | యశ్ బిజీ..

ఇక యశ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టాక్సిక్ మూవీ బిజీలో ఉన్నారు. ఈ సినిమాను జూన్ 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు యశ్.. రామాయణ మూవీలో రావణుడుగా నటిస్తున్నారు. రామాయణ ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ లో దీపావళికి రిలీజ్ కానుంది. ఆతర్వాత రామాయణ పార్ట్ 2 నెక్ట్స్ ఇయర్ దీపావళికి రిలీజ్ కానుంది. ఇలా యశ్ టాక్సిక్, రామాయణ రెండు పార్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా యశ్ ని కేజీఎఫ్ 3 గురించి అడిగితే.. ప్రశాంత్ నీల్ తో టచ్ లోనే ఉన్నానని.. కేజీఎఫ్ పార్ట్ 3 గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు. అయితే.. ఖచ్చితంగా కేజీఎఫ్ 3 ఉంటుంది కానీ.. ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్నారు. దీనిని బట్టి కేజీఎఫ్ 3 ఇప్పట్లో ఉండదని నిరాశ కలిగించే విషయం. ఎప్పుడు ఉంటుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..

KGF 3

Leave a Reply