బ్రహ్మోత్సవాలకు బయలుదేరిన వెంకటేశుడు
భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భీమారం – హసన్ పర్తి ఆలయాల నుండి శ్రీ భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఎర్రగట్టు గుట్ట కు బయలుదేరారు. ఈ సందర్బంగా ఆలయ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆరుట్ల శ్రీనివాసచార్యులు, శ్రీధర్ ఆచార్యులు శ్రీనాథ చార్యులు పెద్ద చక్రాల బండ్లపై నిలిపారు. అనంతరం భక్తుల, జయ ద్వాజ ధ్వనుల మధ్య ఊరేగింపుగా భక్తుల కొలహలంగా స్వామి వారి రథాన్ని ఎర్రగట్టుగుట్ట వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం స్వామివారి పాదయాత్రలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
