పోచమ్మవాడలో హోలీ సంబురాలు

పోచమ్మవాడలో హోలీ సంబురాలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మగుడి వద్ద మంగళవారం హోలీ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కామ దహన కార్యక్రమం జరిగిన చోట హోలీ సంబరాలను తెల్లవారుజాముననే కాలనీ వాసులు ప్రారంభించి రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్ద సంఖ్యలో యువకులు, ప్రజలు ఇక్కడకు తరలివచ్చి రంగులు చల్లుకొని ఆనందిస్తూ హోలీ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ కార్యక్రమానికి ఎంతో సందడిని తీసుకువచ్చారు.

Leave a Reply