Breaking | నల్గొండలో ఘోరం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి
- కుళ్లిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. తెలంగాణ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇంట్లో మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో.. వారు నాలుగు నుంచి ఐదు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న నల్గొండ వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు, మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబానికి చెందిన మరో యువకుడు కనిపించకపోవడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ప్రాథమికంగా ఆత్మహత్య అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, మిస్సింగ్ యువకుడి అంశం నేపథ్యంలో హత్య కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
