నందీశ్వరుడి అభిషేకంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి…

సూర్యాపేట రూరల్: కార్తీక సోమవారం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి సందర్శించారు. త్రికుటాలయంలో నందీశ్వరునికి పంచామృతాభిషేకం చేసి, అనంతరం నామేశ్వర, ఎరకేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మన చారిత్రక, సాంప్రదాయ సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత,” అని పేర్కొన్నారు.

డా. వాణిని దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఆమెతో పాటు డిటివోలు జయప్రకాశ్ రెడ్డి, లావణ్య, ఎంవిఐలు కొండయ్య, ఆదిత్య, ఎఎంవిఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply